తక్షణమే పెంచిన వంట గ్యాస్ పెట్రోలు
డీజలు విద్యుత్తు చార్జీలను తక్షణమే తగ్గించాలని
-పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు ఎస్.ఎం.డి రఫీ
నంద్యాల పట్టణంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు ఎస్.ఎం.డి.రఫీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను రెండు మాసాలకు ఒకసారి పెంచుతుందని దీనివలన ప్రస్తుత గ్యాస్ ధర రూ. 1100 అయిందని వినియోగదారులకు ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కోలేక పోతున్న పేద మధ్యతరగతి ప్రజలపై భారం వేయడం తగదన్నారు గత ప్రభుత్వంలో సబ్సిడీ లబ్ధిదారుల ఖాతాలో వేసేవారని ఇప్పుడు దానిని అదుపు చేయడం దారుణమన్నారు తక్షణమే పెంచిన గ్యాస్ ధరలు తగ్గించి సబ్సిడీ జమ చేయాలని అదేవిధంగా పెట్రోల్ గ్యాస్ విద్యుత్ ఛార్జీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ముప్పేట దాడి చేయడం వలన దీనికితోడు ఇంటి పనులు చెత్త పన్ను వేయడం ప్రజలకు కునుకు లేకుండా చేసే పరిస్థితి ఉందన్నారు. తక్షణమే పెంచిన ఇంటి పన్నులు రద్దు చేయాలని. పెట్రోలు డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రము పెంచుతూ పోతుంటే తగ్గించేది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిత్యవసర వస్తువుల ధరలు వంట నూనెలు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని వీటిని తగ్గించడంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విఫలం అయ్యారని విమర్శించారు తక్షణమే రాష్ట్రంలో ధరలు అదుపు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే వామపక్షాల పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.