(బిఎన్ న్యూస్), మార్చి 16: నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజన్‌కు సంబందించి 30 వాహనాలు సంబంధిత అధికారుల అనుమతితో అడిషనల్ ఎస్పీ ఆర్.రమణ పర్యవేక్షంలో పట్టణ డిఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల వేలం వేయడం జరిగింది. ఇందులో సుమారు 40 మంది వేలంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేలంపాటలో బైకులు, ఆటోలు, కార్లు వేలం వెయ్యగా జిఎస్టితో కలిపి రూ.6,16,250 రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మూడవ పట్టణ సిఐ టి.నరసింహులు, తాలూకా రూరల్ సిఐ రవీంద్ర, ఎస్ఐలు నాగార్జున రెడ్డి, సుధాకర్ రెడ్డి వారి సిబ్బంది పాల్గొన్నారు.

పట్టుబడిన వాహనాలు వేలంలో రూ.6,16,250 ఆదాయం -అడిషనల్ ఎస్పీ ఆర్.రమణ
- Post published:March 16, 2023
- Post category:Andhra Pradesh / Nandyal