(బిఎన్ న్యూస్), మార్చి 16: అమరజీవి పొట్టి శ్రీరాములు జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా విద్యాశాఖాధికారి అనురాధ అమరజీవి పొట్టి శ్రీరాములు వారి చిత్ర పటమునకు పుష్పాంజలి ఘటించారు. ఆమె మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధనకోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి అని పేర్కొన్నారు. ఆయన జన్మదినాన్ని స్మరించుకొనడం మహా భాగ్యముగా భావిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమములో అసిస్టెంట్ డైరెక్టర్ కె.గోపాల్, ఉప విద్యశాఖాధికారి జేన్, ఉమ్మడి జిల్లాల డిప్యూటీ ఇన్స్‌పెక్టర్, కార్యాలయపు సిబ్బంది, పాల్గొన్నారు.
