You are currently viewing ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలు అర్పించిన ధీరోదాత్తుడు పొట్టి శ్రీరాములు  -జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్

ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలు అర్పించిన ధీరోదాత్తుడు పొట్టి శ్రీరాములు -జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్

(బిఎన్ న్యూస్‌), మార్చి 16: ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలు అర్పించిన ధీరోదాత్తుడు శ్రీ పొట్టి శ్రీరాములు అని జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని వైయస్సార్ సెంటనరీ హాలులో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి, ఘనంగా పుష్పాంజలితో నివాళులర్పించారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు విశేష కృషి చేసిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు అని అన్నారు. తెలుగు భాష మాట్లాడే వారందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలని అకుంఠిత దీక్షతో నిరాహార దీక్ష చేసారన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలు అర్పించిన ధీరోదాత్తుడు పొట్టి శ్రీరాములు అన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి అనురాధ, పర్యాటకశాఖ అధికారి సత్యనారాయణ తదితరులు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి చిత్రపటం వద్ద ఘనంగా పుష్పాంజలి ఘటించారు.