You are currently viewing మరణించిన సిబ్బంది కుటుంబానికి ఆర్థిక సహాయం -జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి

మరణించిన సిబ్బంది కుటుంబానికి ఆర్థిక సహాయం -జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి

(బిఎన్ న్యూస్‌), మార్చి 16: ఆర్మీడ్ రిజర్వ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తూ జ‌న‌వ‌రి 28వ తేదిన అనారోగ్యంతో మరణించిన కీర్తి శేషులు అల్లా బకాష్ కుటుంబానికి ఫ్లాగ్ ఫండ్ క్రింద రూ.25,000 చెక్కును, విడో ఫండ్ కింద 50,000 చెక్కును, ఉమ్మడి జిల్లా ఏఆర్ సిబ్బంది అనారోగ్యంతో మరణించిన కీర్తి శేషులు అల్లా బకాష్ భార్య జయనాబికి 1,00,000 చెక్కును మొత్తం 1,75,000 రూపాయల చెక్కులను జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి చేతులమీదుగా గురువారం అందచేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మరణించిన సిబ్బంది యొక్క కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మరణించడం బాధాకరమని, ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనను కలవవచ్చునని, పోలీసు శాఖ వారికి అన్ని విధాలు అండగా ఉంటుందని ఎస్పీ వారికి భరోసా కల్పించారు. ప్రభుత్వం నుండి అందవలసిన ఇతర అన్ని బెనిఫిట్లను త్వరితగతిన వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆర్.రమణ, డిపిఓ ఏఓ నిజాముద్దీన్, డిపిఓ సూపరింటెండెంట్ ఖాదర్ వలి, ఆర్ సుధాకర్, ఆర్ఎస్ఐ సోమశేఖర్ పాల్గొన్నారు.