You are currently viewing జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు -జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి

జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు -జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి

(బిఎన్ న్యూస్‌), మార్చి 16:  జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయం నందు గురువారం పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవియైన మహాపురుషుడు అని కొనియాడారు. ఆంధ్రులకు భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు అన్నారు. పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత మళ్ళీ 1941-1942 సంవత్సరాల్లో క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాడు. 1985లో ప్రచురింప బడిన ఆంధ్ర ఉద్యమం కమిటీ అధ్యయనంలో పొట్టి శ్రీరాములు – మహాత్మా గాంధీల మధ్య అనుబంధం ఏర్పడింది. సబర్మతి ఆశ్రమంలో శ్రీరాములు సేవ చరిత్రాత్మకమైనది. ప్రేమ, వినయం, సేవ, నిస్వార్ధతలు మూర్తీభవించిన స్వరూపమే శ్రీరాములు. సత్యాన్ని అహింసను ఆరాధించే ప్రేమమూర్తి. శ్రీరాములు తన కర్తవ్య దీక్షలను ఉత్సాహంగా నిర్వహిస్తూ ఆశ్రమంలో అందరి మన్ననలనూ పొందాడు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బలుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించాడు. ప్రభుత్వం ప్రత్యక ఆంద్ర రాష్ట్రం ఏర్పాటు దిశగా అడుగులు వేయడంలో ముఖ్య పాత్ర పోసించారు. పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ప్రాణాలు అర్పించారు. చివరికి డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేస్తూ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రకటన చేసాడు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆర్.రమణ, అర్ముడు రిజర్వ్ పోలీసు డిఎస్పీ సంకురయ్య, రిజర్వ్ ఇన్స్‌పెక్టర్ సుధాకర్, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.