(బిఎన్ న్యూస్), మార్చి 13: నంద్యాల జిల్లాలోని సోమవారం జరిగిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం, ప్రభుత్వ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఫర్ గర్ల్స్ వద్ద గల పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి సందర్శించి, భద్రత చర్యలను పర్యవేక్షించారు. అనంతరం ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం విధులు కొనసాగాలని, అక్కడ బందోబస్తు విధులలో ఉన్న పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల స్పెషల్ బ్రాంచ్ సిఐ దస్తగిరి బాబు, సిఐ పులిశేఖర్, మూడవ పట్టణ సిఐ టి.నరసింహులు పాల్గొన్నారు.

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ
- Post published:March 13, 2023
- Post category:Andhra Pradesh / Nandyal