You are currently viewing శిక్షణ పొందిన వారితోనే ఫిజియోథెరపీ చేయించుకోండి

శిక్షణ పొందిన వారితోనే ఫిజియోథెరపీ చేయించుకోండి

  • Post category:Nandyal

-నంద్యాల ఫిజియో థెరపీ సంఘం

ప్రస్తుత కాలంలో ఫిజియోథెరపీ వైద్యం బాగా అభివృద్ధి చెందింది. అన్ని ఆప రేషన్ల తర్వాత, పక్షవాతం మొదలగు వ్యాధులనుండి త్వరగా కోలుకోవటానికి ఫిజియోథెరపీ వైద్యము ఇంటి వద్దకే వచ్చి అందిస్తున్నారు. నంద్యాల జిల్లాలో దాదాపుగా 100 మంది ఫిజియోథెరపిస్టు తమ సేవల ప్రజలకు అందిస్తున్నారు. నంద్యాల జిల్లా ఫిజియోథెరపీ సంఘం వైద్యులు కన్వీనర్ రోహిణి, ప్రధాన కార్యదర్శి శివబాలి రెడ్డి, జగదీశ్వర రెడ్డి కోశాధికారి, సర్వేశ్వర్ రెడ్డి, శివ ప్రసాదరాజు, క్రాంతి సుధాలు మాట్లాడుతూ ఇదే సమయంలో కొంతమంది అర్హత లేకున్నా క్లినిక్లు పెట్టడమే కాకుండా ఇంటి వద్దనే ఫిజియో థెరపీ వైద్యం చేయడం ద్వారా రొ గులకు అపార నష్టం జరుగుతున్నది. దీనిని నివారించటం కోసం ఐఏపి ( ఫిజియో థెరపీ సంఘం)జిల్లాలో ఉన్నటువంటి ఫిజియోథెరపిస్ట్ వివరాలు సేకరించి ప్రజలకు నాణ్యమై, ఫిజియోథెరపీ వైద్యం అందజేయడం కోసం కృషి చేస్తున్నాము. ఫిజియోథెరపీ వైద్యుడా కాదా అనే అనుమానం వస్తే 9697969758కు కాల్ చేసి వారి వివరాలు తెలుసుకొ వచ్చునని అన్నారు. అర్హత లేని వారితో ఫిజియోథెరపీ చికిత్స అనర్ధ దాయకం డాక్టర్ రవి కృష్ణ ప్రజలు ఫిజియోథెరపీ చికిత్సను శిక్షణ పొందిన, అర్హత కలిగిన ఫిజియోథెరపిస్ట ద్వారా మాత్రమే పొందాలని, లేనిపక్షంలో అది వారు కోలుకోవడానికి ఆలస్యం కావడమే కాకుండా ఒక్కోసారి అనర్థాలకు దారితీస్తుందని ఐఎమ్ఎ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి. రవి కృష్ణ సూచించారు. ఈ విషయంలో నంద్యాల ఫిజియోథెరపి సంఘం సూచనలను పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.