You are currently viewing రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవానికి నాందిపలికిన జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవానికి నాందిపలికిన జగన్మోహన్ రెడ్డి

 

దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శం అని పేర్కొన్న ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి

(బిఎన్ న్యూస్‌), మార్చి 08: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోని దిగ్గజ కంపెనీలతో విశాఖ పట్టణంలో ఏర్పాటు చేసిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగింది. కోట్లాదిరూపాయల పెట్టుబడులు చేయడం జరిగింది. పెట్టడానికి కేవలం వారికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఉన్న నమ్మకం, విశ్వాసం, భరోసా అని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి తెలిపారు. ఈ మేరకు నంద్యాల పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధ‌వారం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని తెలియజేశారు. ఈ సందర్భంగా శిల్పాచక్రపాణిరెడ్డి మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 13లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఒక వేదికగా నిలిచిందన్నారు. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి సాధించడమే కాకుండా ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాది అవకాశాలు కల్పిచడం జరుగుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో చేస్తున్న అభివృద్ధి దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలు మన రాష్ట్రం వైపు చూస్తున్నాయంటే అతిశయోక్తి కాదన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు వస్తున్నానని ఊకదంపుడు ప్రసంగాలు చేసి చివరకు 39వేల కోట్లకు ఒప్పందాలు చేసుకొని ఆఖరికి కేవలం 5 సంవత్సరాలలో సగంకూడా పెట్టుబడులు రాలేదన్నది ప్రజలు గ్రహించారన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి సాధించేందుకు, భావితరాల భవిషత్తుకు అనేక దిగ్గజ కంపెనీలతో ప్రాజెక్టు చేపడుతున్నారని తెలిపారు. చంద్రబాబు సూట్ కేస్ కంపెనీలు, బోగస్ కంపెనీల పేరుతో ప్రజలను మభ్యపెట్టారని ఎద్దేవా చేశారు. నేడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆపరిస్థితి లేదని చెప్పాడంటే చేసి చూపించే సత్తా కలిగిన నాయకుడన్నారు. చంద్రబాబు అపద్దాలు చెబితే ఆయన తనయుడు బుర్రలేకుండా మోకాళ్లలో తెలివితో ఏదో తెలిసినట్లు నటిస్తారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డిపై ఎన్ని పార్టీలు ఏకమైనా ఎవ్వరూ ఏమి చేసుకోలేరని తిరిగి అధికారంలోకి వచ్చేది వైఎస్సార్పీపీ అని ధీమావ్యక్తం చేశారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన అన్ని రకాల బకాయిలను ఈనెలాఖరులోగా చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని, టీడీపీ మాదిరి ద్వంద్వ ధోరణి తమది కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో శిల్పాభువనేశ్వరరెడ్డి, మహానంది దేవస్థానం చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, దేశువెంకటరామిరెడ్డి, వ్యవసాయ కమిటీ చైర్మన్ మహానంది శర్వారెడ్డి,నగభూపాల్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.