చెత్త బండ్ల వాహనాలను నిలిపివేసిన పి.వి.నగర్ ప్రజలు
మున్సిపల్ అధికారులతో వాగ్వాదం
నంద్యాల, (బిఎన్ న్యూస్), మార్చి 08: స్థానిక పి.వి.నగర్‌లోని డంప్ యార్డులో నిన్నటి రాత్రి భారీగా పోగా పి.వి.నగర్ మొత్తం చుట్టుకుంది. పొగ రావడం వల్ల పసి పిల్లలకు, వృద్ధులకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వార్డు కౌన్సిలర్ పిచికే నాగార్జున ఆరోపించారు. బుధవారం మున్సిపల్ అధికారులతో ఆయన వాగ్వాదం చేస్తున్న స్థానిక ప్రజలు ఊపిరితిత్తుల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కనీసం గాలి పీల్చడం కూడా ఇబ్బందిగా మారిందన్నారు. ఈ విషయం పై పలు సార్లు మున్సిపల్ అధికారులకు మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో ఎన్నిసార్లు చెప్పుకున్న ఈ డంప్ యార్డు సమస్య తీరడం లేదని పేర్కొన్నారు. మేము గత 25 సంవత్సరముల నుంచి ఇక్కడే ఉంటున్నామని ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎవరు పరిష్కారం చేయడం లేదన్నారు. డ్రైనేజ్ సమస్య, మహిళలకు మరుగుదొడ్ల సమస్య చాలా తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. మహిళలు బహుర్భూమికి వెళ్ళవలసి వస్తుందని తెలిపారు. కేవలం ఇది రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతోనే మా పి.వి.నగర్‌ను పట్టించు కోవడం లేదని ఆరోపించారు. కనీసం మహిళా దినోత్సవం సందర్భంగా నైనా పి.వి.నగర్ మహిళలకు మరుగు దొడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని పార్టీలకతీతంగా ప్రజా సమస్యలను వెంటనే తీర్చాలని కోరారు. కేవలం మేము ఎస్సీ వాళ్ళము కాబట్టి మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడితే ముందు డంప్ యార్డ్ ఉందా పి.వి.నగర్ ముందు ఉందా అని మున్సిపల్ కమిషనర్ ఎదురు ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా మా వార్డు ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డంప్ యార్డు నుండి వచ్చే పొగ నుండి మా ప్రాణాలను కాపాడాలని కౌన్సిలర్ పిచికే నాగార్జున కోరారు.