You are currently viewing మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల జిల్లాలోని హోంగార్డుల‌ వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సేవలు  -జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల జిల్లాలోని హోంగార్డుల‌ వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సేవలు -జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి

నంద్యాల, (బిఎన్ న్యూస్‌), మార్చి 06: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల జిల్లాలోని హోంగార్డుల‌ వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి ఉచిత వైద్య సేవలు అందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంద్రప్రదేశ్ డిజిపి కె.రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు రేంజ్ డిఐజి ఎస్.సెంథిల్ కుమార్ సూచనల మేరకు నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి పర్యవేక్షణలో నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు, ఆళ్లగడ్డ, నంద్యాల, డోన్ నాలుగు సబ్ డివిజన్లకు సంబంధించిన హోంగార్డుల‌కు, వారి కుటుంబసభ్యులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లాలోని సుమారు 106 మందికి శాంతిరాం ఆసుప‌త్రి వారి సహకారంతో జనరల్ చెకప్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, రాండమ్ బ్లడ్ షుగర్, క్రియాటిన్, ఎక్స్‌రే, ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ఈసిజి), అబ్డామిన్ యుసిజి స్కాన్, బెస్ట్ స్కాన్, గైనిక్ ప్రాబ్లమ్స్, ఈఎన్‌టి, ఆర్తో వంటి ఉచితంగా వైద్య చిక్సిత‌లు చేయించారు. ఈ కార్యక్రమానికి ఎక్కువగా డోన్ సబ్ డివిజన్ హోంగార్డుల‌ వారి కుటుంబ సభ్యులు హాజరు కావడం జరిగింది. దీనికి కృషి చేసిన డోన్ డిఎస్పి శ్రీనివాసరెడ్డిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ కె.రఘువీర్ రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మాట్లాడుతూ సమాజంలో మహిళలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని మహిళలు లేకపోతే సమాజం మనుగడను కోల్పోతుందని సమాజం మాత్రమే కాదు ఈ సృష్టి మనుగడ కోల్పోతుందని కావున ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని తెలియజేశారు. పోలీస్ శాఖలో మహిళ సిబ్బందికి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే నిర్లక్ష్యం చేయక వెంటనే తగిన వైద్య చికిత్స చేయించుకోవాలని, మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే వారి కుటుంబం, సమాజం బాగుంటుందన్నారు. మహిళా సిబ్బంది తమ ఆరోగ్య సంరక్షణ పట్ల తగినంత శ్రద్ధ తీసుకోవాలని, సంతులిత ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలని, క్రమ తప్పకుండా వ్యాయామం చేయాలని, ఒత్తిడిని అధిగమించడానికి యోగ, మెడిటేషన్ వంటివి చేయాలని సూచించారు. మహిళలు శారీరికంగా, మానసికంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటూ వారి వారి రంగాల్లో నిర్ధేశిత లక్ష్యాలను సాధించాలని ఆకాక్షించారు. జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న మహిళా సిబ్బంది ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఈ మెడికల్ చెకప్‌లు చేయించడం జరిగిందని శాంతిరాం ఆసుప‌త్రి వారు నంద్యాల జిల్లా పోలీస్ వారికి, హోంగార్డుల‌కు వారి కుటుంబ సభ్యులకు సుమారు 350 మంది పైగా ఉచిత మెడికల్ చెకప్‌లు చేయించడం జరిగిందని తెలియజేశారు. మహిళా సిబ్బందికి సాధారణ అనారోగ్య సమస్యలు, జీవనశైలి వలన వచ్చే వ్యాధులతో పాటు కాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు అత్యాధునిక పరికరాల ద్వారా చెక్ చేసి తగిన చికిత్స అందించామని, మహిళా సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు శాంతిరాం ఆసుప‌త్రి వారు చేసిన సేవకు ఎంతో అభినందించవలసిన విషయం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సుధాకర్, దిశా పోలీస్ స్టేషన్ ఎస్ఐ కల్పన, నాలుగు సబ్ డివిజన్ల హోంగార్డు ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు.