You are currently viewing ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేయదగినవి, చేయకూడనవి సూచనల గోడపత్రికల‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేయదగినవి, చేయకూడనవి సూచనల గోడపత్రికల‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

నంద్యాల, (బిఎన్ న్యూస్‌), మార్చి 06: పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భాన్ని పురస్కరించుకొని ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు ఓటు వేసే విధానంపై స్వీప్ కార్యక్రమం ద్వారా సంపూర్ణ అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ విజ్ఞప్తి చేసారు. సోమవారం ఆయన ఛాంబర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేయదగినవి, చేయకూడనవి సూచనలపై ముద్రించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ జిల్లాలో శాసన మండలి ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు, టీచర్లు ఓటు వేసే విధానంపై స్వీప్ కార్యక్రమం ద్వారా సంపూర్ణ అవగాహన కల్పించాలని సంబంధిత నోడల్ అధికారి లీలావతిని ఆదేశించారు. జిల్లాలోని 94 పోలింగ్ కేంద్రాలు, అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ముద్రించిన స్టిక్కర్ పోస్టర్లను ప్రదర్శించాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఓటర్లు చేయదగినవి, చేయకూడనవి తదితర అంశాలపై ఓటర్లను ప్రభావితం చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య, కమాండ్ కంట్రోల్ రూమ్ సూపరింటెండెంట్ నాగమణి, స్వీప్ నోడల్ అధికారి అధికారి లీలావతి తదితరులు గోడ‌ప‌త్రిక‌ల‌ను ఆవిష్కరించారు.