నంద్యాల, (బిఎన్ న్యూస్), మార్చి 06: నంద్యాల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.ఆర్.వెంకటరమణ అధ్యక్షతన సోమవారం ప్రోగ్రాం అధికారుల సమీక్ష సమవేశం నిర్వహించడం జరిగినది. ఈ సమీక్ష సమావేశంలో భాగంగా ఎన్‌సిడి-సిడి సర్వే 100శాతం నిర్వహించాలని లేనిచో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎన్‌సిడి-సిడి ప్రోగ్రాం అధికారికి హెచ్చరించడమైనది. మలేరియా, డెంగ్యు, మెదడువాపు జ్వరాలు గ్రామాలలో ప్రబలకుండా జాగ్రత్త వహించాలని జిల్లా మలేరియా అధికారికి హెచ్చరించడమైనది. ప్రతి గ్రామంలో ఫ్రై డే – డ్రై డే కార్యక్రమాన్ని 100 శాతం పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశాలు జారిచేయడమైనది. ప్రతి గ్రామంలో వడ దెబ్బ గురుంచి అవగాహన కలిగించాలని తెలియజేయడమైనది. ఆర్‌బిఎస్‌కె, ఆర్‌కెఎస్‌కె కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి 100 శాతం స్క్రీనింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారిచేయడమైనది. మాతా శిశు సంరక్షణ చర్యలు హెచ్ఎమ్ఐఎస్, ఆర్‌సిహెచ్, సిఎస్ఎస్ఎమ్ పోర్టల్ నందు100 శాతం అప్లోడ్ చేయవలెనని మాతృ మరణాలు, శిశు మరణాలు జరగకుండా జాగ్రత్త వహించాలని లేనిఛో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడమైనది. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డిఐఓ డా.ఓ.ప్రభావతి దేవి, అదనపు డిఎమ్‌హెచ్ఓ డా.బాలాజీ, డా.కాంతారావు నాయక్, ఆర్‌బిఎస్‌కె కో ఆర్డినేటర్, డిపిఎమ్ఓ డా.రేఖా, డా.జగదీశ్ చంద్ర రెడ్డి ఎఫ్‌పిసి నోడల్ అధికారి పాల్గొన్నారు.

డిఎమ్‌హెచ్ఓ డా.ఆర్.వెంకటరమణ అధ్యక్షతన ప్రోగ్రాం అధికారుల సమీక్ష సమవేశం
- Post published:March 6, 2023
- Post category:Andhra Pradesh / Nandyal