You are currently viewing జిల్లా కమాండ్ కంట్రోల్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

జిల్లా కమాండ్ కంట్రోల్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

(బిఎన్ న్యూస్‌), మార్చి 04: నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్.మనజీర్ జిలాని సామూన్, జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి నంద్యాల పట్టణంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను శ‌నివారం సందర్శించారు. ఈ సందర్భంగా కమాన్ కంట్రోల్ రూమ్‌లోని సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. నంద్యాల పట్టణంలో ఏ ఏ చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయని వాటి యొక్క పనితీరుని స్వయంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. కొన్ని కేసుల్లో సీసీ కెమెరా పుటేజీలు సాక్ష్యాలుగా కూడా ఉపయోగపడుతున్నాయంటే సీసీ కెమెరాల ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే పలు దొంగతనాలు, కిడ్నాప్‌ కేసుల్లో సీసీ కెమెరాల సాయంతో పోలీసులు కేసులను ఛేదించారు. అలాగే చైన్‌స్నాచింగ్‌ కేసుల్లో సీసీ కెమెరాలే కీలకపాత్ర పోషిస్తున్నాయి. చైన్‌స్నాచింగ్‌ చేసిన వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివ్వడం సీసీ పుటేజీలు సాక్ష్యాలుగా ఉపయోగపడుతున్నాయి. జాతీయరహదారిపై జరిగే రోడ్డు ప్రమాదాల్లోనూ కీలక సాక్ష్యాలను పోలీసులు సేకరించగలుగుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు నిఘా నేత్రాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. నేర నియంత్రణలో నిఘానేత్రం చాలా క్రియాశీల పాత్ర పోషిస్తుందని సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాల్లో నేరగాళ్ల ఆటలు సాగవని తెలియజేస్తూ దొంగతనం కేసులను, యాక్సిడెంట్ కేసులను, శాంతిభద్రతలకు విగాథం కలిగించిన కేసులలో ఇవి టీజింగ్ కేసుల సీసీ కెమెరాల పాత్ర చాలా కీలకమని వీటివల్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చునని, చాలా కేసులను ఛేదించవచ్చునని తెలియజేశారు. అదేవిధంగా నంద్యాల పట్టణంలో ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాలకు అదనంగా అత్యాధునిక కెమెరాలను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్, ఎస్పీ తెలియజేశారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోకి వచ్చి వెళ్లే ప్రతి వాహనాన్ని, ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించే విధంగా వాటి పనితీరు ఉంటుందని, ఈ నిఘా నేత్రాలను పట్టణంలోని ముఖ్యమైన కూడళ్ళులో, సమస్యాత్మకమైన ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు.