You are currently viewing నంద్యాల అర్బ‌న్‌, రూర‌ల్ మండలంగా విభ‌జ‌న

నంద్యాల అర్బ‌న్‌, రూర‌ల్ మండలంగా విభ‌జ‌న

జిల్లా ప్ర‌జ‌ల‌కు ఏవైనా అభ్యంతరములు 30 రోజులలోపు జిల్లా కలెక్టర్‌ని సంప్రదించాలి

(బిఎన్ న్యూస్‌), మార్చి 04: జిల్లా కేంద్రమైన నంద్యాల మండలమును, నంద్యాల అర్బన్ మండలంగా విభజించుటకు ప్రభుత్వం వారు ప్రతిపాదించారు. కావున జిల్లా ప్రజలు ఈ విషయమై షెడ్యూల్ నందు తెలిపిన వివరములపై ఏవైనా అభ్యంతరములు ఉన్న ఈ గజట్ నోటిఫికేషన్ ప్రచురించిన 30 రోజులలోపు నంద్యాల జిల్లా కలెక్టర్‌ని సంప్రదించవలసినదిగా శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వారు ప్రకటనలో తెలిపారు. నంద్యాల అర్బ‌న్‌గా నంద్యాల‌, మూల‌సాగ‌రం, నూనెప‌ల్లె, కొత్త‌ప‌ల్లి, ఉడుమల్పురం, అయ్య‌లూరుగా ప్ర‌క‌టించారు. నంద్యాల రూర‌ల్‌గా పోలూరు, రాయమాల్ పురం, మునగాల, పులిమద్ది, భీమవరం, బిల్లాలాపురం, కొట్టాల, చాపిరేవుల, పుసులూరు, బ్రాహ్మణ పల్లె, మిట్నాల, కానాల, చాబోలు, గుంతనాల ప్ర‌క‌టించారు. జిల్లా ప్ర‌జ‌ల‌కు ఏమైనా అభ్యంత‌రములు ఉంటే 30 రోజులలోపు నంద్యాల జిల్లా కలెక్టర్‌కి సంప్రదించవలసినదిగా కోరారు.