You are currently viewing స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

  • బియాండ్ ఎస్ఎల్ఎలోకి ఏ ఒక్క దరఖాస్తు వెళ్లకూడదు
  • -జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ సంబందిత జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలోని వైఎస్సార్ సెంటినరీ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, డిఆర్ఓ పుల్లయ్య తదితరులు జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ స్పందన ద్వారా స్వీకరించిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. టాప్ 4 సర్వీసులలో ఉన్న పెన్షన్ కు సంబంధించిన పెండింగ్ అంశం, టాప్ 10 సర్వీసెస్లో పెండింగ్ ఉన్న ఇన్కమ్ సర్టిఫికెట్, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ల అంశాలను రెండు రోజుల్లో పరిష్కరించి క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బియాండ్ ఎస్ఎల్ఎలో ఎందుకు పెండింగ్ ఉన్నాయని, తాసిల్దార్ లు స్పందన పోర్టల్ ను చెక్ చేయడం లేదని స్పందన వాట్సాప్ గ్రూప్ లో అన్ని అంశాలకు సంబంధించిన అర్జీలు పోస్ట్ చేసినప్పటికీ అపరిష్కృత సమస్యలు పరిష్కరించకుండా పెండింగ్లో ఉంచుతూ కారణాలు చెప్పడం సరికాదన్నారు. బియాండ్ ఎస్ఎల్ఎలో అర్జీలు పెండింగ్ ఉన్న తాసిల్దార్ లందరికీ నోటీసులు జారీ చేయాలని డిఆర్ఓను కలెక్టర్ ఆదేశించారు. స్పందన అర్జీలపై రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో అర్జీదారుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత కాలపరిమితిలోగా అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. టెక్నికల్ సమస్యలు ఉంటే యాక్టివేట్ చేసుకుని సమస్యలు పరిష్కరించాలే తప్పా కాలయాపన చేయడం పధ్ధతి కాదని కలెక్టర్ స్పష్టం చేశారు. 24 గంటలు 48 గంటలలోపు బియాండ్ ఎస్ ఎల్ ఎలోకి వెళ్లే సమస్యలు వుంటే వెంటనే పరిష్కరించాలని…. స్పందన వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవన్నారు. వార్తా పత్రికలలో ప్రచురితమయిన వ్యతిరేక వార్తలకు సంబంధిత అధికారులు రీజాయిన్డెర్లు పంపడంలో అలక్ష్యం చేస్తున్నారని పెండింగ్లో ఉన్న ప్రతికూల వార్తల రీజాయిన్డెర్ లను వెంటనే పంపాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలికా సంరక్షణ పై వివిధ రకాల కరపత్రాలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి ఇతర అధికారులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 150 మంది అర్జీదారులు తమ సమస్యలపై వినతి పత్రాలు కలెక్టర్ కు సమర్పించారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.