You are currently viewing స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్‌) అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన మధుమోహన్ రావు

స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్‌) అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన మధుమోహన్ రావు

(బిఎన్ న్యూస్‌), మార్చి 03: చిత్తూరు జిల్లాలోని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోలో అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ బదిలీ పై నంద్యాల జిల్లా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్) విభాగానికి అసిస్టెంట్ కమిషనర్‌గా బదిలీ కాబడిన సిహెచ్‌.మధు మోహన్ రావు శుక్ర‌వారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డిని జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అసిస్టెంట్ కమిషనర్‌తో మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో నాటు సారా, అక్రమ మద్యం మొదలగునవి పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేయాలని పలు సూచనలు సలహాలు ఇచ్చారు.