(గ్లోబల్ ఇన్వెన్షన్స్) విద్యార్థులను నూతన ఆవిష్కరణల వైపు నడిపించడమే తమ కళాశాలల లక్ష్యం
-ఛైర్మన్ డా.మిద్దె శాంతి రాముడు
శాంతి రాం ఇంజనీరింగ్ కళాశాలలో సిగ్మా 2023 ఘనంగా ప్రారంభం
(బిఎన్ న్యూస్), మార్చి 03: ఇంజనీర్లు మరో రూపంలో ఉన్న సృష్టి కర్తలని ( గ్లోబల్ ఇన్వెన్షన్స్) అంతర్జాతీయ స్థాయిలో నూతన ఆవిష్కరణల వైపు విద్యార్థులను ప్రోత్సహించడమే తమ కళాశాలల లక్ష్యమని ఆర్జీఎం, శాంతి రాం విద్యా సంస్థల అధినేత డా.మిద్దె శాంతి రాముడు అన్నారు. శాంతి రాం ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో విద్యార్థులు తమ స్వీయ అనుభవాలు, లక్ష్యాలను పంచుకునేందుకు ఏర్పాటు చేసిన సిగ్మా 2023ని డా.మిద్దె శాంతి రాముడు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని, పరిశోధనా పత్రాలను సమర్పిస్తారు. ఈ సందర్భంగా డా.మిద్దె శాంతి రాముడు మాట్లాడుతూ ఇంజనీర్ అంటే సాఫ్ట్వేర్ అనే భావన తొలగిపోవాలంటే, విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకుని, అంతర్జాతీయ స్థాయి పోటీకి సామర్థ్యాన్ని పెంచుకోవాలని కోరారు. ఈ దిశగా అవసరమైన చర్యలను ఆర్జీఎం, శాంతి రాం ఇంజనీరింగ్ కళాశాలలో ఇప్పటికే అందుబాటులో కి తెచ్చామని అన్నారు. చంద్రుడి పై ఉన్న అత్యంత విలువైన హీలియం 3ని, భూమి పైకి ఎలా తీసుకరావాలనే అంశాన్ని ఈ సిగ్మా 2023కి హాజరైన విద్యార్థులు ఛాలెంజింగ్‌గా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఒక కేజీ హీలియంతో ఈ ప్రపంచానికి ఒక సంవత్సరం సరిపోయే విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని అన్నారు. కళాశాల డైరెక్టర్ డా.డివి.అశోక్ కుమార్ మాట్లాడుతూ నూతన ఆవిష్కరణ లకు సంబంధించి విద్యార్థులకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందించడంలో భాగంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఐఈఈఈ ప్రోగ్రాంను ఆర్జీఎం, శాంతి రాం ఇంజనీరింగ్ కళాశాలలలో ప్రవేశపెట్టామని అన్నారు. ఈ ప్రోగ్రాంలో సభ్యులైన విద్యార్థులకు గ్లోబల్ రికగ్నిషన్ లభిస్తుందని అన్నారు. ప్రిన్సిపల్ డా ఎం.వి.ఎస్.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులు తమ ఆలోచనలను, పరస్పరం పంచుకోవడం ఎంతో ముఖ్యమని అన్నారు. అందుకే ఈ సిగ్మా 2023ని ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 113 పరిశోధన పత్రాలను విద్యార్థులు సమర్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ డా.శేషయ్య, అన్ని విభాగాల అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సిగ్మా ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్
సిగ్మా 2023లో భాగంగా కళాశాల ఆవరణలో నిర్వహించిన ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్‌ను ఛైర్మన్ డా.మిద్దె శాంతి రాముడు ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్‌లో ఆయన ప్రతి స్టాల్ సందర్శించి, విద్యార్థులతో కలిసి పోయి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అద్దం ముందు నిలబడితే అదే ఫోటో తీసే, విచిత్ర దర్పణం, రకాల సాంకేతిక పరికరాలు, తదితర అంశాలు అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.