You are currently viewing స్పందన ఫిర్యాదులకు చట్ట పరిధిలో సత్వర పరిష్కారం -జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి

స్పందన ఫిర్యాదులకు చట్ట పరిధిలో సత్వర పరిష్కారం -జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి

(బిఎన్ న్యూస్‌), ఫిబ్ర‌వ‌రి 27: ప‌ట్ట‌ణంలోని బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదిదారుల నుంచి నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి 72 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండీ విచ్చేసిన ఫిర్యాదిదారుల సమస్యలను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడి చట్టపరిధిలో ఫిర్యాదిదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, స్పందన ఫిర్యాదులను మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని, స్పందన ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా సివిల్ తగాదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు ,అత్తరింటి వేదింపులు మొదలగు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ ఫిర్యాదుల పై అధికారులు తీసుకున్న చర్యలను జిల్లా కార్యాలయానికి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని, ప్రతి సోమవారం ప్రతి పోలీసు స్టేషన్, సర్కల్ కార్యాల‌యం, డి‌ఎస్‌పి కార్యాల‌యాల‌లో స్పందన కార్యక్రమం నిర్వహించి జిల్లా పోలీసు కార్యాలయానికి సంబంధిత సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దిశ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కల్పన పాల్గొన్నారు.