You are currently viewing లయన్స్ సేవలు మరింత విస్తృతం చేయాలి :లయన్స్ గవర్నర్ రామచంద్ర ప్రకాష్

లయన్స్ సేవలు మరింత విస్తృతం చేయాలి :లయన్స్ గవర్నర్ రామచంద్ర ప్రకాష్

(బిఎన్ న్యూస్‌), ఫిబ్ర‌వ‌రి 27: లయన్స్ డిస్ట్రిక్ట్ 316 జె గవర్నర్ రామచంద్ర ప్రకాష్ నంద్యాల అధికార పర్యటన సందర్భంగా స్థానిక బాలాజీ కళ్యాణమండపంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు చంద్రమోహన్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో రామచంద్ర ప్రకాష్ మాట్లాడుతూ లయన్స్ సేవలు మరింత విస్తృతం చేయాలని, గ్రామీణ ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టడం అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో అతిధులుగా పాల్గొన్న రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి, శ్రీ గురు రాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ దస్తగిరి రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ నంద్యాలలో లయన్స్ క్లబ్ గత 50 సంవత్సరాలు పైగా చక్కటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని భవిష్యత్తులో కూడా ఇదేవిధంగా సేవా కార్యక్రమాల్ని నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ నంద్యాల కార్యదర్శి లయన్ కూరా ప్రసాద్ తండ్రి శ్రీనివాస్ స్వర్గధామం అభివృద్ధికి 30 వేల రూపాయలు విరాళం గవర్నర్ చేతుల మీదుగా అందించారు. కార్యదర్శి కూర ప్రసాద్ కోశాధికారి రత్న కుమార్ గత సంవత్సర కాలంగా లయన్స్ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు నివేదిక సమర్పించారు. సభ ప్రారంభంలో లయన్స్ అంతర్జాతీయ సేవా సంస్థ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ రామచంద్ర ప్రకాష్‌ను అతిధులు డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ దస్తగిరి రెడ్డి, డాక్టర్ రవికృష్ణ , లయన్స్ క్లబ్ క్యాబినెట్ కార్యదర్శి పసుపుల సుబ్రహ్మణ్యం, కార్యక్రమాల క్యాబినెట్ కార్యదర్శి సత్యనారాయణ లను నంద్యాల లయన్స్ క్లబ్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ చైర్మన్ కసెట్టి చంద్రశేఖర్, సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్ సహదేవుడు, శ్రీకాంత్, రవి ప్రకాష్, భవనాశి నాగ మహేష్, అధిక సంఖ్యలో లయన్స్ సభ్యులు కుటుంబాలతో కలిసి పాల్గొన్నారు.