You are currently viewing కరాటే విజేతలకు బహుమతుల పంపిణీ

కరాటే విజేతలకు బహుమతుల పంపిణీ

(బిఎన్ న్యూస్‌), ఫిబ్ర‌వ‌రి 27: కర్నూలు జిల్లా జీత్ కునే డో కరాటే సంఘం ఆధ్వర్యంలో, జిల్లా సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన జిల్లాస్థాయి కరాటే పోటీల ముగింపు ఉత్సవంలో లయన్స్ జిల్లా గవర్నర్ రామచంద్ర ప్రకాష్, రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. జిల్లా కరాటే సంఘం కార్యదర్శి బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలలో జిల్లా నలుమూలల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. కటాస్, కుమితే విభాగాలలో వివిధ వయస్సు కేటగిరీలలో పోటీలు నిర్వహించి విజేతలకు పతకాలు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ కరాటే క్రీడ వలన బాలలలో శారీరక దారుఢ్యం ఆత్మస్థైర్యం ఇనుమడిస్తాయని ఆత్మవిశ్వాసం మెరుగవుతుందని, క్రమశిక్షణ ఏకాగ్రత పెరుగుతాయని తద్వారా వారు చదువులో కూడా రాణించడానికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను చదువుతోపాటు క్రీడలు కలలో కూడా ప్రోత్సాహం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్లు బాలకృష్ణ, రంగస్వామి, రాంబాబు, పవన్, వెంకటసుబ్బయ్య, జోత్స్న, తరుణ్, లాల్ తరుణ్, రామాంజనేయులు, హరిబాబు, రవిచంద్ర, రామకృష్ణ, రాజశేఖర్, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.