You are currently viewing నంద్యాల పట్టణ ప్రజల త్రాగునీటి సమస్య పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి

నంద్యాల పట్టణ ప్రజల త్రాగునీటి సమస్య పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి

 

అధికారుల ఆదేశించిన ఎమ్మెల్యే శిల్పారవి చంద్ర కిషోర్ రెడ్డి

నంద్యాల (బిఎన్ న్యూస్‌), ఫిబ్ర‌వ‌రి 23: పట్టణంలో నెలకొన్న త్రాగునీటి సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశించారు. గురువారం ఈ మేరకు ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి సంబంధిత అధికారులతో నంద్యాల పట్టణానికి నీటి సమస్య పరిష్కరించేందుకుగాను అమృత్ స్కీం పనులను పరిశీలించి, పనుల పురోగతిని తెలుసుకొని అధికారులకు తగు సూచనలు, ఆదేశాలను ఎమ్మెల్యే తెలియజేశారు. త్వరలో నంద్యాల పట్టణ ప్రజల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ నీటి సమస్య పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామన్నారు. అమృత్ స్కీం పథకానికి సమాంతరంగా నీటి సరఫరా అందించేందుకు మరో పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నామని, ఆ పనులు రానున్న 15 నుండి 20 రోజుల్లో పూర్తి చేస్తామని కమిషనర్ తెలిపారు. రానున్న వేసవిలో నీటి ఎద్దడి లేకుండా అన్ని చర్యలు చేపడతామని వారు తెలిపారు.