You are currently viewing రాష్ట్రవ్యాప్తంగా లయన్స్ సంస్థల సేవా కార్యక్రమాలు విస్తృతం

రాష్ట్రవ్యాప్తంగా లయన్స్ సంస్థల సేవా కార్యక్రమాలు విస్తృతం

-లయన్స్ సంస్థ అంతర్జాతీయ నాయకులు విజయ కుమార్ రాజు

నంద్యాల (బిఎన్ న్యూస్‌), ఫిబ్ర‌వ‌రి 23:  రాష్ట్రంలో ఉన్న 450 లయన్స్ క్లబ్బులకు చెందిన లయన్స్ జిల్లా గవర్నర్లు, మాజీ గవర్నర్లతో కూడిన ఆంధ్రప్రదేశ్ మల్టిపుల్ కౌన్సిల్ రెండు రోజుల సదస్సు గురువారంతో ముగిసింది. స్థానిక ప్రముఖ హోటల్ సమావేశ మందిరంలో మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ అనిల్ కుమార్ శేట్టి అధ్యక్షతన, అంతర్జాతీయ లయన్స్ సేవా సంస్థ ఫౌండేషన్ ట్రస్టీ విజయ కుమార్ రాజు ముఖ్యఅతిథిగా నిర్వహించిన ఈ రెండు రోజుల సదస్సులో రాష్ట్రంలో రానున్న సంవత్సరాలలో చేపట్టదలచిన సేవా కార్యక్రమాల గురించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో నైతిక విలువలు, మానవ సంబంధాలుతో కూడిన విద్యను అందించడంలో భాగంగా దశలవారీగా ఉపాధ్యాయులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇచ్చి వారి ద్వారా విద్యార్థుల ఆలోచనలు సరైన మార్గంలో నడిచేలా చూడాలని అందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. అదేవిధంగా అంతర్జాతీయ లయన్స్ సంస్థ ఆకలి పై చేస్తున్నా పోరులో భాగంగ ఉచితంగా ఆహారం అందించే వాహనాలు ఏర్పాటు చేయడం అందుకు అవసరమైన పదార్థాలు తయారు చేసే ఆధునిక కిచెన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మొదటి దశలో నంద్యాలలో ఈ కార్యక్రమానికి నాంది పలకడానికి అవసరమైన నిధులు కేటాయిస్తున్నారు. విద్యా, ఆకలి కార్యక్రమాలతో పాటు ప్రజారోగ్యానికి సంబంధించి ఐఎంఏ రాష్ట్ర శాఖతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా డయాబెటిస్ వ్యాధి అవగాహన సదస్సులు, గుర్తింపు పరీక్షా శిబిరాలు, శాశ్వత చక్కర వ్యాధి నివారణ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ లయన్స్ సేవా సంస్థ అవసరమైన నిధుల్ని కేటాయించాలని ఈ సదస్సులో కీలక నిర్ణయం తీసుకున్నారు. సదస్సులో తీసుకున్న నిర్ణయాలను గురువారం సాయంత్రం నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో లయన్స్ సేవా సంస్థ ఫౌండేషన్ అంతర్జాతీయ నాయకులు విజయకుమార్ రాజు, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, లయన్స్ జిల్లా గవర్నర్ రామచంద్ర ప్రకాష్, వైస్ గవర్నర్లు నాగేశ్వర యాదవ్, మాఘం గౌతమ్, మల్టిపుల్ కౌన్సిల్ మాజీ చైర్మన్ ఏ వి ఆర్ ప్రసాద్‌లు వివరించారు. సదస్సులో మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ అనిల్ కుమార్, అంతర్జాతీయ లయన్స్ ఫౌండేషన్ ట్రస్ట్ ప్రతినిధి విజయకుమార్ రాజులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన లయన్స్ జిల్లా గవర్నర్లు గోపీచంద్, రామచంద్ర ప్రకాష్, మంగతాయారు, ఉషారాజు, పంకజాక్షన్, మాజీ లయన్స్ క్లబ్ మల్టిపుల్ చైర్ పర్సన్ లు కృష్ణంరాజు, ఏవి ఆర్ ప్రసాద్, డాక్టర్ శ్రీనివాస్, శివశంకర్, వేమా కోటేశ్వరరావు, ఉపేంద్ర, మాజీ గవర్నర్లు నాగేశ్వరరావు, నరసింహులు, సురేష్ ,కిషోర్, బయ్యా రవికుమార్, చిన్నపరెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.