నంద్యాల (బిఎన్ న్యూస్), ఫిబ్రవరి 23: రైతు భరోసా కేంద్రాలలో జొన్న కొనుగోలు గురువారం ప్రారంభం అయినట్లు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకి రూ.2970తో కొనుగోలు చేస్తుందని నంద్యాల మండల వ్యవసాయ అధికారి స్వప్నిక తెలిపారు. కావున నంద్యాల మండల రైతుసొదరులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. జొన్న వేసిన రైతులందరూ ప్రభుత్వ పంట కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవడానికి సంబంధిత రైతుభారోసా కేంద్రాలలో పంట నమోదు చేసుకున్న రైతులు ఈ కేవైసీ చేయించుకుని, పంట కొనుగోలుకు మీ పేరు నమోదు చేసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా గోనె సంచులు, రవాణా చార్జీలు పౌర సరఫరా వారు సరఫరా చేస్తారని చెప్పడం జరిగింది.