నంద్యాల (బిఎన్ న్యూస్), ఫిబ్రవరి 23: నంద్యాల మండలం అబాండం తండా సమీపంలో ఉన్న పాలేరు వాగులో విద్యుత్ తీగలు కిందికి ఉండడం వల్ల అక్కడికక్కడే బర్రెలు గురువారం మృతి చెందాయి. పెద్ద కొట్టాల అబాండం తాండాలో ఉన్న పశువుల కాపరులు నిత్యం ఎక్కడ పశువులు కాస్తు ఉంటారు. ఎన్నిసార్లు విద్యుత్ శాఖ అధికారులకు చెప్పిన పట్టించుకోకపోవడం వల్లే వారి నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని బర్రెల యజమాని షేక్ నూర్ అహ్మద్ తన ఆవేదనే వ్యక్తం చేశారు. గతంలో కూడా పెద్ద కొట్టాలకు చెందిన రాజారెడ్డి అనే రైతుకు సంబంధించి నా మూడు బర్రెలు ఇక్కడే విద్యుత్ తగిలి చనిపోయాయని ఎన్నిసార్లు విద్యుత్ శాఖ అధికారులకు విన్నపించిన తమ మాటలు పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఒక్కొక్క బర్రె రూ.30 నుంచి రూ.40 వేల వరకు ఉంటుందని అన్నారు.

విద్యుత్ తీగలు తగిలి బర్రెలు మృతి
- Post published:February 23, 2023
- Post category:Andhra Pradesh / Nandyal