You are currently viewing గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియను వేగవంతం చేయండి

గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియను వేగవంతం చేయండి

హద్దురాళ్లు నాటే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులను ఆదేశించిన భూ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జి.సాయి ప్రసాద్

నంద్యాల (బిఎన్ న్యూస్‌), ఫిబ్ర‌వ‌రి 23: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద జిల్లాలో రీసర్వే చేపట్టిన గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను భూ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఆదేశించారు. గురువారం విజయవాడ సిసిఎల్ఏ కార్యాలయం నుండి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం, రీసర్వే, గ్రౌండ్ ట్రూతింగ్, తదితర అంశాలపై కలెక్టర్‌లు, జేసిలతో సిసిఎల్ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్, జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జి.సాయి ప్రసాద్ మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాల తనిఖీ, గ్రౌండ్‌ ట్రూతింగ్‌, గ్రౌండ్‌ వ్యాలిడేషన్‌, సెక్షన్ 13 నోటిఫికేషన్, ఫైనల్ ఆర్ ఓఆర్, భూ హక్కు పత్రం ఈకేవైసీ, సెక్షన్ 9(2) నోటీస్, డ్రోన్ ఫ్లయింగ్, 9(2) / 10(2) నోటీస్ సర్వేడ్, 9(2) / 10(2) ఆఫీస్ డిస్పోజల్ మొబైల్ మెజిస్ట్రేట్ తదితర ప్రక్రియలను వేగవంతం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే రెవెన్యూ, సర్వే సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ పరిష్కరించాలని సూచించారు. అవసరమైతే బృందాల సంఖ్యను పెంచి, లక్ష్యాల మేరకు సర్వేను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నిర్దేశించిన గడువులోగా గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియను పూర్తి స్థాయిలో చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రౌండ్ ట్రూతింగ్ తరువాత వెట్రైజేషన్, విలేజ్ సర్వేయర్, విఆర్ఓ లాగిన్ లో డేటా ఎంట్రీ సకాలంలో చేయాలన్నారు. హద్దురాళ్లు నాటే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఫీల్డ్ ఫ్యూరిపీకేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ పనులను పూర్తి చేయాలన్నారు.