You are currently viewing శ్రీ కామేశ్వరి సమేత మహానందిశ్వర స్వామివారలను దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు దంపతులు

శ్రీ కామేశ్వరి సమేత మహానందిశ్వర స్వామివారలను దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు దంపతులు

నంద్యాల (బిఎన్ న్యూస్‌), ఫిబ్ర‌వ‌రి 22: శ్రీ గంగా కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి వారలను ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు దంపతులు దర్శించుకున్నారు. బుధవారం తెల్లవారుజామున అర్చకస్వాములు, ఆలయ మర్యాదలతో మంగళ వాయిద్యాలతో ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, వారి ధర్మపత్ని రాజ్యలక్మి వార్లకు ఆలయ కార్య నిర్వహణ అధికారి కాపు చంద్రశేఖర్ రెడ్డి స్వాగతం పలికారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ వెంట ప్రెస్ అకాడమీ సెక్రెటరీ బాలగంగాధర తిలక్, రామకృష్ణ పీజీ కళాశాల చైర్మన్ రామకృష్ణారెడ్డిలు పాల్గొన్నారు. అనంతరం మహానందీశ్వర స్వామి, కామేశ్వరి అమ్మవార్ల ప్రభాత హారతిని వీక్షించారు. తదుపరి మహానందీశ్వర వారికి రుద్రాభిషేకం, అర్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ గంగా కామేశ్వరి అమ్మవారికి గోత్రనామాలు, సంకల్పముతో కుంకుమార్చన గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు కుటుంబానికి, ప్రెస్ అకాడమీ సెక్రెటరీ బాలగంగాధర తిలక్, రామకృష్ణ పీజీ కళాశాల చైర్మన్ రామకృష్ణారెడ్డిల‌కు అర్చక స్వాములు, వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాల‌ను అందచేశారు.