You are currently viewing మాట ఇచ్చాడంటే ఆ మాట మీద నిలబడిన ఏకైక ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే -ఎమ్మెల్యే శిల్పా రవి

మాట ఇచ్చాడంటే ఆ మాట మీద నిలబడిన ఏకైక ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే -ఎమ్మెల్యే శిల్పా రవి

నంద్యాల (బిఎన్ న్యూస్‌), ఫిబ్ర‌వ‌రి 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చాడంటే ఆ మాట మీద నిలబడిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే వారే వైయస్ జగన్మోహన్ రెడ్డి అని నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక న్యాయాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన ముఖ్యమంత్రి 14 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారికి ఎమ్మెల్సీ పదవులు అందించారని తెలిపారు. ఈ ఘనత జగనన్నది అని ఎమ్మెల్యే అన్నారు. బుధవారం ఎమ్మెల్యే నివాసంలో మీడియాతో శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత టిడిపి ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవులను కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే కేటాయించిందని, నేడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయాన్ని తూచా తప్పకుండా పాటించారని, ఇటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేరని పేర్కొన్నారు. ఓట్లకోసం, అధికారం కోసం కాకుండా అభివృద్ధికి పెద్ద పీట వేసిన నాయకుడు జగనన్న అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు
పదవులు కట్టపెట్టిన ఏకైక నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు. పదవులు అంటే కేవలం కొన్ని వర్గాలకు మత్రమే అన్న మాటను వ్యతిరేకించిన నాయకుడు మన ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి అని చెప్పడానికి గర్వపడుతున్నానన్నారు.
4 గురు బీసీలను చట్ట సభలకు పంపిన ఘనత జగనన్నదన్నారు. కొన్ని ఎల్లో మీడియా పత్రికలు విషపు పత్రికలుగా మారి అసత్య ప్రచారం, ఆరోపణ చేశారని తెలిపారు. ఆ పత్రికల్లో కుటుంబ వ్యవహారాలు గురించి రాస్తే అది జర్నలిజం ఎలా అవుతుందని ప్రశ్నించారు. సమాజం మంచికోసం, వార్తల కోసం పత్రికలు ఉండాలని కోరారు. కేవలము కొన్ని వర్గాలకు పార్టీలకు కొమ్ము కాస్తున్నాయని విమర్శించారు. సామాజిక న్యాయం చేసి నిరూపించిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.