You are currently viewing ఓమెగా హెల్త్ కేర్ ప్రాంగణం ఎంపికలో శాంతి రాం ఫార్మసీ విద్యార్థుల ప్రతిభ

ఓమెగా హెల్త్ కేర్ ప్రాంగణం ఎంపికలో శాంతి రాం ఫార్మసీ విద్యార్థుల ప్రతిభ

నంద్యాల (బిఎన్ న్యూస్‌), ఫిబ్ర‌వ‌రి 22: ట్రైనీ మెడికల్ కోడర్ ఉద్యోగాలకు 55 మంది ఎంపిక ప్రాంగణ ఎంపికల్లో శాంతి రాం ఫార్మసీ కళాశాల విద్యార్థులు మరో సారి తమ ప్రతిభ చాటుకుంటున్నారు. ఓమేగా హెల్త్ కేర్ సంస్థలలలో మెడికల్ కోడర్‌లు 55 మంది ఫైనల్ ఇయర్ బి ఫార్మసీ, డి ఫార్మా విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ సి.మధుసూదన్ శెట్టి మాట్లాడుతూ ఎంపిక అయిన విద్యార్థులకు సంవత్సరానికి రూ 2.52 లక్షల వేతనం లభిస్తుందని అన్నారు. శాంతి రాం ఫార్మసీ కళాశాలలోని ప్లేస్ మెంట్ సెల్ ఆధ్వర్యంలో మెడికల్ కోడింగ్ పై శిక్షణా ఇవ్వడం వల్ల సులువుగా ఉద్యోగాలు సాధించారని అన్నారు.