You are currently viewing రైతులందరూ జొన్నలను పౌర సరఫరా సంస్థ‌ ద్వారా ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించాలి  -జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి

రైతులందరూ జొన్నలను పౌర సరఫరా సంస్థ‌ ద్వారా ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించాలి -జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి

నంద్యాల (బిఎన్ న్యూస్‌), ఫిబ్ర‌వ‌రి 22: జిల్లాలోని రైతు సోదరులు తాము పండించిన చిరుధాన్యాలు అనగా జొన్నలు ప్రభుత్వం నిర్ణయించినటువంటి కనీస మద్దతు ధరకు రైతు కల్లాల వద్దనే నాణ్యత ప్రమాణాలను అనుసరించి కొనుగోలు చేసి వెంటనే అక్కడిక్కడే ఆ పంటకు వచ్చు పైకం మొత్తాన్ని కల్లాల వద్దనే నగదు రూపంలో చెల్లించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి బుధ‌వారం రైతుల‌కు తెలిపారు. ఆమె ఈ క్రాప్, ఈ కేవైసీతో పాటు తమ పేర్లను నమోదు చేయించుకున్న రైతులు మాత్రమే కొనుగోలుకు అర్హులని పేర్కొన్నారు. గోనె సంచులు, హామ‌లీ చార్జీలు, రవాణా చార్జీలను పౌర సరఫరాల సంస్థ‌ ఏర్పాటు చేస్తుందన్నారు. దీనిని జిల్లాలోని రైతు సోదరులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి తెలియజేశారు.