You are currently viewing రేషన్‌కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ -జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి

రేషన్‌కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ -జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి

నంద్యాల (బిఎన్ న్యూస్‌), ఫిబ్ర‌వ‌రి 19: జిల్లాలో ఉన్న రేషన్ కార్డుదారులందరికీ ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్‌కార్డు పరిధిలోని ఎం.డి.యు ( మోబైల్ వాహనం) ద్వారా ఎలాంటి రుసుము చెల్లించకుండా ఉచితంగా బియ్యాన్ని పొందాల్సిందిగా ఆమె తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే బియ్యం కొనుగోలు, అమ్మకం చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. బియ్యం సరఫరా చేసే సమయంలో ఎవరైనా డబ్బులు చెల్లించమని కోరినా లేదా తూకం సరిగా లేకపోయినా 1967 కాల్ సెంటరుకు ఫిర్యాదు చేయవలసినదిగా ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు.