నంద్యాల (బిఎన్ న్యూస్), ఫిబ్రవరి 19: రేపు స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీశైలంలో రాష్ట్ర గవర్నర్ శ్రీశైలం పర్యటన సందర్భాన్ని పురస్కరించుకుని నంద్యాల పట్టణంలోని వైఎస్సార్ సెంటినరీ హాలులో ఈ సోమవారం జరగాల్సిన స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా కేంద్రంలో మినహా మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో యథాతథంగా స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
