You are currently viewing రేపు సోమ‌వారం పోలీసు స్పందన కార్యక్రమం తాత్కలిక రద్దు -జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి

రేపు సోమ‌వారం పోలీసు స్పందన కార్యక్రమం తాత్కలిక రద్దు -జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి

నంద్యాల (బిఎన్ న్యూస్‌), ఫిబ్ర‌వ‌రి 19: రేపు సోమ‌వారం అనివార్య కారణాల వల్ల నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు స్పందన కార్యక్రమమును తాత్కలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున అర్జీదారులు సుదూర ప్రాంతాల నుండి వ్యయ, ప్రయాసలతో ప‌ట్ట‌ణంలోని బొమ్మ‌ల‌స‌త్రం వద్ద గ‌ల‌ జిల్లా పోలీసు కార్యాలయంలోని జిల్లా ఎస్పీ స్పందన కార్యక్రమముకు రావొద్దని తెలిపారు. జిల్లా ప్రజలు ( ఫిర్యాదుదారులు) ఈ విషయాన్ని గమనించగలరని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. వచ్చే సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు స్పందన కార్యక్రమం యధావిధిగా కోనసాగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.