You are currently viewing ఘనంగా ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం

ఘనంగా ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం

  • Post category:Nandyal

రెడ్ క్రాస్ సేవలు అమూల్యం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.లలిత

అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ మనజీర్ జిలాని సామున్ ఆదేశాల మేరకు నంద్యాల రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు నంద్యాల రెడ్ క్రాస్ అధ్యక్షుడు దస్తగిరి పర్ల తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక జిల్లా ఆసుపత్రిలోని కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో ఆసుపత్రి ఇన్ ఛార్జ్ సూపరిండెంట్ డా. ఓ. లలిత ముఖ్య అతిథిగా విచ్చేసి రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూనంట్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా రెండేళ్ల చిన్నారికి పదివేల విలువైన మందులను సెవెన్ హిల్స్ హాస్పిటల్ ఎండి మారుతికుమార్ విరాళంగా అందించారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలోని రోగులందరికి పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ డివిజన్ సెక్రెటరీ ఉస్మాన్ బాష, కోశాధికారి నాగేశ్వరరావు, మండల అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి, రెడ్ క్రాస్ ఉపాధ్యక్షుడు, సెవెన్ హిల్స్ హాస్పిటల్ ఎండీ మారుతి కుమార్, సభ్యులు షరీఫ్, శ్రీనివాస్, నూర్, నయిమ్, బాబా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మారుతి సహకారంతో షుగర్ వ్యాధి కల రెండేళ్ల చిన్నారికి దాదాపు పదివేల విలువైన మందులు పంపిణీ చేయడంతో పాటు ఇటీవల ప్రమాదానికి గురై మంచానికి పరిమితమైన సంపత్ అనే హమాలికి (వైస్సార్ నగర్) నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డా.లలిత మాట్లాడుతూ రెడ్ క్రాస్ సేవలు కొనియాడారు. రెడ్ క్రాస్ ప్రతినిధులు మాట్లాడుతూ రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్, కలెక్టర్ నేతృత్వంలో భవిష్యత్ లో నూతన జిల్లాలో రెడ్ క్రాస్ సేవలు విస్తరిస్తామన్నారు.