నంద్యాల (బిఎన్ న్యూస్), ఫిబ్రవరి 16: పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించిన వ్యాన్‌ను స్కాప్‌గా ఈనెల 23వ తేది వేలం వేయబడునని కళాశాల ప్రిన్సిపల్ రాయపురెడ్డి గురువారం తెలిపారు. వ్యాన్ వివరాలు వ్యాన్ నెంబర్ ఏడిక్యూ 5889, మోడల్ నెంబర్ 10-1987 అని పేర్కొన్నారు. వేలంలో పాల్గొనాలనుకున్న వారు ఈనెల 23వ తేదిన ఉదయం 10 గంటలకు పాలిటెక్నిక్ కళాశాలలో హజరు కావాలని ప్రిన్సిపల్ తెలియజేశారు.

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించిన వ్యాన్‌ను స్కాప్‌గా వేలం
- Post published:February 16, 2023
- Post category:Andhra Pradesh / Nandyal