నంద్యాల (బిఎన్ న్యూస్), ఫిబ్రవరి 16: మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఎంపిపి పాఠశాల, పసురపాడు పాఠశాలలను జిల్లా విద్యా శాఖాధికారి అనురాధ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట పదవ తరగతి విద్యార్థులను కలసి వారి భవిష్యత్తు కొరకు కష్టపడి చదవాలి అని, నైతిక విలువలు పెంపొందించుకోవాలని, ఉన్నత వ్యక్తిత్వం అలవరచుకోవాలని తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి ఎస్ఏ1 మార్కులు ఆన్‌లైన్ నమోదు గిరించి అడిగారు. అది చేయకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. తర్వాత మధ్యాహ్న భోజనం విద్యార్థులతో కలిసి భుజించారు. లేమాన్ రైస్‌లో పులుపు తగ్గిందని, రుచిగా చేయాలని ఎమ్‌డిఎమ్ ఏజెన్సీని హెచ్చరించారు. అటెండెన్స్‌కు మీల్ టేకెన్‌కు తేడాను గుర్తించి, ప్రధానోపాధ్యాయుని పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయని ప్రధానోపాధ్యాయునికి షో కాజ్ నోటీస్‌ను జారీ చేశారు. అనంతరం ఎంపిపిఎస్ పసురపాడును సందర్శించారు. విద్యార్థుల సామర్ధ్యాలను పరీక్షించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు వర్క్ బుక్‌లలో తప్పులను సరిదిద్దిన తర్వాతనే టిక్ వేసి సంతకం పెట్టాలని సూచించారు. పోస్ట్ బాక్స్‌ను వెంటనే అమర్చాలని హెచ్ఎమ్ రాజశేఖర్‌కు సూచించారు. డిఈఓ వెంట ఎంఈఓ అబ్దుల్ కరీం, సిఆర్పి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

గోస్పాడు మండలంలోని పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన డిఈఓ
- Post published:February 16, 2023
- Post category:Andhra Pradesh / Nandyal