నంద్యాల (బిఎన్ న్యూస్), ఫిబ్రవరి 16: ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఆల్ కర్నూల్ చెస్ అసోసియేషన్ నిర్వహణలో రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించిన నంద్యాల జిల్లా స్థాయి 19 సంవత్సరాల లోపు బాల బాలికల చదరంగం పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. బహుమతి ప్రధానోత్సవంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య, లయన్స్ క్లబ్ కోశాధికారి రత్న కుమార్ అతిధులుగా పాల్గొని విజేతలకు ట్రోఫీలు,పతకాలు అందజేశారు.
విజేతల వివరాలు: బాలికల విభాగంలో వరుసగా ఆళ్లగడ్డకు చెందిన రిషితాబాయి, భారతి, నంద్యాలకు చెందిన చాహత్ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించగా, నాలుగో స్థానంలో వెలుగోడుకు చెందిన దీక్ష శ్రీ, బాలుర విభాగంలో వరుసగా నంద్యాలకు చెందిన హర్షవర్ధన్ ఆచారి, ఆళ్లగడ్డకు చెందిన జ్యోతిష్ రెడ్డి, మాన్విత్ నాయక్ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించగా, నాలుగో స్థానంలో మహమ్మద్ ఫర్హాన్ నిలిచి బహుమతులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చెస్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి రామసుబ్బారెడ్డి, ఆర్బిటర్లు ఇమామ్, సుజాత పాల్గొన్నారు.
