సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్
నంద్యాల (బిఎన్ న్యూస్), ఫిబ్రవరి 14: నిరుపేదలందరికీ ఇళ్ళు పధకం కింద జగనన్న లేఔట్లలో ఉగాది నాటికి కేటాయించిన 10,464 ఇళ్ల నిర్మాణ లక్ష్యాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ ఎంపీడీవోలు, మండల తహసీల్దార్లు, హౌసింగ్ అధికారులు, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వైయస్సార్ సెంటనరీ హాల్‌లో ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, మండల తహసీల్దార్లు, హౌసింగ్ అధికారులు, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉగాది నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి గృహప్రవేశాలు చేయాలన్న నేపథ్యంలో ప్రగతి తక్కువగా ఉన్న మండలాల్లో ప్రతిరోజు సమీక్షించాలని ఎంపీడీవో, తహసీల్దార్లు, హౌసింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో కేటాయించిన 10464 ఇళ్లలో ఇప్పటివరకు కేవలం 1907 గృహాల మాత్రమే పూర్తయ్యాయని మిగిలిన గృహాలను ఉగాది లోపు పూర్తి చేసేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంపీడీవోలను, తహసీల్దార్లను, హౌసింగ్ అధికారులను ఆదేశించారు. స్టేజ్ కన్వర్షన్, బిల్లుల అప్లోడ్ తదితర అంశాలపై సచివాలయాల వారీగా లక్ష్యాలు కేటాయించి సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు బాధ్యతలు అప్పగించి ప్రతిరోజు ఫాలోఅప్ చేయాలన్నారు. ప్రగతి తక్కువగా చూపిన సచివాలయాలకు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు మూడు పర్యాయాలు షోకాజ్ నోటీసులు జారీ చేసి తదుపరి చర్యల నిమిత్తం ఫైల్ సర్కులేట్ చేయాలని జిల్లా పరిషత్ డిప్యూటీ సిఈఓ సుబ్బారెడ్డిని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై ప్రతిరోజు సమీక్షించి చర్యలు తీసుకుంటే మరుసటి రోజు ఫలితాలు వస్తాయన్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, హౌసింగ్ అధికారులు నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించకుండ కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు పూర్తిస్థాయి దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని లేఔట్లలో నీటి వసతి, విద్యుత్, అప్రోచ్ రోడ్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించామని గృహ నిర్మాణాల్లో వేగాన్ని పెంచేందుకు లబ్ధిదారులను పురమాయించాలన్నారు. బనగానపల్లి, మహానంది, ఉయ్యాలవాడ, కొలిమిగుండ్ల మండలాలలో డిఆర్డిఏ ద్వారా రుణాల మంజూరు శాతం తక్కువగా ఉందని ఏటీఎంల ద్వారా రుణాలు మంజూరు చేయించి గృహాలు నిర్మించుకునేందుకు ప్రోత్సహించాలని డిఆర్డిఏ పీడీ శ్రీధర్ రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో క్యాస్ట్ ఇన్కమ్ సర్వేలో పూర్తి వెనకబడిందని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంపిడిఓ లను ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద లేబర్ బడ్జెట్ రిపోర్టింగ్ తక్కువగా ఉందని ఏపీఎం, ఏపీవోలు నిర్లక్ష్య ధోరణి విడనాడిడి లేబర్ రిపోర్టింగ్ శాతాన్ని పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. లక్ష మందికి గాని 33,572 మంది మాత్రమే ఉపాధి కూలీ పనులకు హాజరవుతున్నారని నిర్దేశించిన లక్ష్యాన్ని ఈ వారంలో సాధించాలని కలెక్టర్ సూచించారు. మిడుతూరు, జూపాడుబంగ్లా, నందికొట్కూరు, డోన్ ప్రాంతాలలో లేబర్ రిపోర్టింగ్ శాతం చాలా తక్కువగా ఉందని ఏపీవోలు ఏం చేస్తున్నారని కలెక్టర్ ప్రశ్నించారు. ఈ సమావేశంలో హౌసింగ్ పిడి రామశేషు, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, డ్వామా పిడి రామచంద్రారెడ్డి, డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, నంద్యాల, డోన్ ఆర్డీవోలు శ్రీనివాసులు, వెంకటరెడ్డి, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ శ్రీనివాస్ యాదవ్, నియోజకవర్గ స్పెషల్ అధికారులు, ఎంపీడీవోలు తహసీల్దార్లు, ఎపిఓలు, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.