నంద్యాల (బిఎన్ న్యూస్), ఫిబ్రవరి 14: నంద్యాల జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఆజాదికా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం మంగళవారం వద్ద జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.ఆర్.వెంకటరమణ సైక్లింగ్ ర్యాలీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం నుండి డా.వైయస్ఆర్ విగ్రహం వరకు సైక్లింగ్ ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ సైక్లింగ్ ర్యాలీలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. సైక్లింగ్ వలన కలుగు లాభాల గురించి ప్రజలకు అవగాహన కల్గించడం జరిగినది.
సైక్లింగ్ వలన కలుగు లాభాలు:
1.ఆరోగ్యకరమైన శారీరక బరువు, 2.ఒత్తిడిని తగ్గించడానికి సైక్లింగ్ సహాయపడుతుంది, 3.రక్తపోటును నియంత్రించడానికి దోహదపడుతుంది, 4.ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉండడానికి సహాయపడుతుంది, 5.ముఖ్యంగా క్యాన్సర్ అనే జబ్బును ఓడించడానికి సహాయపడుతుంది.