You are currently viewing మహానందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి

మహానందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి

నంద్యాల (బిఎన్ న్యూస్‌), ఫిబ్ర‌వ‌రి 13: నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి నంద్యాల జిల్లా మహానందిలో శ్రీ కామేశ్వరీ సమేత మహానందిశ్వర స్వామి వారి శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమ‌వారం మహానంది పుణ్యక్షేత్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ పార్కింగ్ ప్రదేశాలను, ఎద్దుల పోటీ నిర్వహించి ప్రదేశాలలో భద్రతా ఏర్పాట్లను, దేవాలయం చుట్టూ ఉన్న పరిసరాలను, రథోత్సవం నిర్వహించే ప్రదేశాలలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం దేవస్థానం అడ్మినిస్ట్రేషన్ కార్యాల‌యం నందు దేవస్థానం ఈవో చంద్రశేఖర్ రెడ్డి, ధర్మకర్త మండలి చైర్మన్ కొమ్మ మహేశ్వర్ రెడ్డితో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్ల గురించి తీసుకోవలసిన భద్రత చర్యల గురించి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం శ్రీ కామేశ్వరీ సమేత మహానందిశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల టౌన్ డిఎస్పీ సి.మహేశ్వర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ దస్తగిరి బాబు, నంద్యాల తాలూకా రూరల్ ఇన్స్‌పెక్టర్ రవీంద్ర, మహానంది ఎస్ఐ నాగార్జున రెడ్డి పాల్గొన్నారు.