You are currently viewing విచారణ జరిపి చట్టపరిధిలో న్యాయం చేస్తాం -జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి

విచారణ జరిపి చట్టపరిధిలో న్యాయం చేస్తాం -జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి

నంద్యాల (బిఎన్ న్యూస్‌), ఫిబ్ర‌వ‌రి 13: జిల్లా కేంద్ర‌మైన నంద్యాల ప‌ట్ట‌ణంలోని బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదిదారుల నుంచి నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి 52 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన ఫిర్యాదిదారుల సమస్యలను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకున్నారు.

కొన్ని ఫిర్యాదులు
1) మా చిన్నాన్న బాలగంగాధర్ రెడ్డితో కలిసి నంద్యాల పట్టణం బొమ్మల సత్రానికి చెందిన తెల్లాకుల మద్దిలేటి, తెల్లాకుల సన్నన్న ఇద్దరు కలిసి మా తండ్రి సంతకాలతో ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని భూపనపాడు గ్రామానికి చెందిన సిద్ధం సురేష్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 2) ఇండియన్ బుల్స్ అనే కంపెనీ మాది బెంగళూరు, హైదరాబాదులో కార్యాల‌యంలో ఉన్నాయని పర్సనల్‌ లోను రూ.5 లక్షల దాకా ఇస్తామని నందివర్గం గ్రామానికి చెందిన ఎస్.వెంకటరమణకు ఫోన్ చేయగా వెంకటరమణ లోన్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజుల కొరకు పలు దఫాలుగా రూ.67 వేలు ఫోన్ పే ద్వారా పంపమని ఇంతవరకు లోన్ ఇవ్వకుండా ఇంకా రూ.37,000 కావాలని ఇస్తేనే లోన్ ఇస్తామని మోసం చేస్తున్నారని ఎస్.వెంకటరమణ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 3). నాకు పనుల కొరకు జె.సి.బి ప్రోక్లైన్లు ఇప్పిస్తానని పలుకూరు గ్రామానికి చెందిన టి.రామకృష్ణ రూ.50,000 డబ్బులు తీసుకొని జె.సి.బిలు పంపకుండా డబ్బులు ఇవ్వకుండా ఉన్నాడని గోరుకల్లు గ్రామానికి చెందిన రామ్మోహన్ ఫిర్యాదు చేశారు.
స్పందనకు వచ్చిన ఫిర్యాదులన్నింటిపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని, మీ సమస్యలకు త్వరితగతిన పరిష్కరిస్తామని ఫిర్యాదుదారులకు జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ఫిర్యాదుల పై అధికారులు తీసుకున్న చర్యలను జిల్లా కార్యాలయానికి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని, ప్రతి సోమవారం ప్రతి పోలీసు స్టేషన్, సర్కల్ కార్యాల‌యం, డి‌ఎస్‌పి కార్యాల‌యాల‌లో స్పందన కార్యక్రమం నిర్వహించి జిల్లా పోలీసు కార్యాలయానికి సంబంధిత సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ తెలియజేశారు.
గమనిక:- ఫిర్యాదిదారులు సుదూర ప్రాంతాల నుండి వ్యయ ప్రయాసలతో జిల్లా పోలీస్ కార్యాలయానికి రాకుండా తమ ఫిర్యాదులను, సమస్యలను వాట్సాప్ ద్వారా గాని ఫోన్ చేసి కానీ నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయం 9154987020 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చునని జిల్లా ఎస్పీ తెలియజేశారు.