You are currently viewing రైతులు ఈకేవై చేయించుకుంటేనే ప్రభుత్వం ద్వారా వచ్చే లబ్ది చేకూరుతుంది -జిల్లా వ్యవసాయ అధికారి మోహనరావు

రైతులు ఈకేవై చేయించుకుంటేనే ప్రభుత్వం ద్వారా వచ్చే లబ్ది చేకూరుతుంది -జిల్లా వ్యవసాయ అధికారి మోహనరావు

నంద్యాల (బిఎన్ న్యూస్‌), ఫిబ్ర‌వ‌రి 12: వైయస్ అర్ రైతు భరోసా – పి యం కిసాన్ పథకం క్రింద నంద్యాల జిల్లాలో మొత్తం 222958 మంది లబధిదారులు కాగా ఇందులో 1,82,908 మంది రైతులు మాత్రమే ఈ కే వై సి చేపించుకున్నారు. మిగిలిన రైతులు 40,048 మంది రైతులు ఈ కే వై చేయించుకుంటేనే ప్రభుత్వం ద్వారా వచ్చే లబ్ది చేకూరుతుందని ఆదివారం జిల్లా వ్యవసాయ అధికారి మోహనరావు తెలియ‌జేశారు. అలాగే రైతులు ఓటిపి పద్ధతిలో కానీ, వేలిముద్ర ద్వారా కానీ ఈ – కే వై సి చేయించుకోవచ్చునుని పేర్కొన్నారు. అలాగే ఎన్‌పిసిఐ అనగా బ్యాంక్ అకౌంట్‌కి, మొబైల్ నెంబర్‌కి అనుసంధాన కాని రైతులు పోస్ట్ ఆఫీస్‌లో 50 రూపాయలు చెల్లించి అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా వారికి ప్రభుత్వం ద్వారా వచ్చే 13వ వి పి యమ్ కిసాన్ లబ్ది వస్తుందని తెలిపారు.