You are currently viewing చాపిరేవుల జిల్లా పరిషత్ పాఠశాల నందు కబడి పోటీలను ప్రారంభం -ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి

చాపిరేవుల జిల్లా పరిషత్ పాఠశాల నందు కబడి పోటీలను ప్రారంభం -ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి

నంద్యాల (బిఎన్ న్యూస్‌), ఫిబ్ర‌వ‌రి 12: కీర్తిశేషులు ఎర్రబోలు సుబ్బారెడ్డి, కీర్తిశేషులు ఎర్రబోలు జయ లక్ష్మమ్మ జ్ఞాపకార్థం చాపిరేవుల గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మాజీ మార్కెట్ చైర్మన్ ఆధ్వర్యంలో ఆదివారం కబడి పోటీలను నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ చాపిరేవుల గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల నందు కీర్తిశేషులు ఎర్రబోలు సుబ్బారెడ్డి, కీర్తిశేషులు ఎర్రబోలు జయ లక్ష్మమ్మ జ్ఞాపకార్థం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కబ్బడి పోటీలను నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. అదేవిధంగా విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా పాల్గొనాలని ముఖ్యంగా విద్యార్థులు గెలుపు ఓటములను సమానంగా తీసుకుని ఆటల పోటీలలో పాల్గొనాలని నేటి ఓటమి రేపు గెలుపుకు నాంది కావాలని ప్రతి ఒక్కరూ విజయం సాధించాలన్న దృఢ సంకల్పంతో మాత్రమే ఆటలు ఆడాలని పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు తెలియజేశారు.