నంద్యాల (బిఎన్ న్యూస్), ఫిబ్రవరి 12: అనంతపురం జిల్లా గుత్తి మండలం చెల్లోపల్లిలో ఉన్న సేవాగడ్లో ఈనెల 13, 14, 15వ తేదీలలో నిర్వహించనున్న సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ గిరిజనులకు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని స్థానిక జిపిఎస్ కార్యాలయ ఆవరణంలో జిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ చేతుల మీదుగా సేవాలాల్ మహారాజ్ పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ యావత్ భారత దేశ బంజారాలకు ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బంజారాల జీవితాలను ప్రభావితం చేసిన సేవలాల్ మహారాజును వాడవాడల్లో ప్రతి తండాలో దేవుడిగా పూజిస్తున్నామని అన్నారు. కొండల మధ్యలో తండాలలో జీవిస్తున్న బంజారాలకు బాగా ప్రభావితం చేసిన సేవలాల్ మహారాజ్ అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చిన్న వారిని బంజారాl ఆరాధ్య దైవముగా, గురువుగా పూజించుకుంటున్నామని తెలిపారు. బ్రిటిష్ పాలకులకు మందు గుండు, ఆయుధ సామాగ్రి అందించే సంచార జీవులుగా ఉండే లంబాడీలకు ఏకతాటిపై తీసుకొచ్చి వారి ధైర్యాన్ని నింపిన మహారాజును దేవుడిగా పూజిస్తున్నామని అన్నారు. 1739 ఫిబ్రవరి 15న జన్మించిన సేవాలాల్ మహారాజ్ గుత్తి మండలంలో ఆయన జయంతి ఉత్సవాలను నలమూలాల ప్రాంతాల నుంచి లక్షలాదిమంది వచ్చి జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుతారని అన్నారు. బంజారా జాతుల పరువు ప్రతిష్టల గురించి ముందే ఊహించిన వ్యక్తి సేవాలాల్ మహారాజ్ అహింసా సిద్ధాంతాన్ని పునాది వేశారన్నారు. అంతేకాదు ఆచరించి చూపారు. బంజారా జాతుల సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు ఎంతో కృషి చేశారు. బంజారాలకు ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ గిరిజనులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బంజారా ధర్మ రక్ష సమితి జిల్లా అధ్యక్షుడు కె చందు నాయక్ అడ్వకేట్, కాలు నాయక్, పెద్దమ్మతృనాయక్, మహేష్ నాయక్, బాబు నాయక్, జిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బాలనాయక్, టీచర్ మత్తు నాయక్, గుండు నాయక్, అశోక్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
