You are currently viewing మహానందిలో నిర్వహించనున్న శివరాత్రి బ్రహ్మోత్సవాలకు నంద్యాల జిల్లా ఎస్పీకి ఆహ్వానం

మహానందిలో నిర్వహించనున్న శివరాత్రి బ్రహ్మోత్సవాలకు నంద్యాల జిల్లా ఎస్పీకి ఆహ్వానం

నంద్యాల (బిఎన్ న్యూస్‌), ఫిబ్ర‌వ‌రి 11:నంద్యాల జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డిని నంద్యాల జిల్లా మహానంది మండ‌లంలో ఈనెల 16 నుండి 21వ తేది వరకు జరగనున్న శ్రీ కామేశ్వరీ సమేత మహానందిశ్వర స్వామి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చి మహానందిశ్వర స్వామి ఆశీర్వాదం పొందాలని మహానంది దేవస్థానం ఈఓ కాపు చంద్రశేఖర్ రెడ్డి, చైర్మన్ కొమ్మ మహేశ్వర్ రెడ్డి నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి సాంప్రదాయబద్దంగా వేదపండితుల ఆశీర్వచనలతో ఆహ్వానం అందించారు. అనంతరం స్వామి వారి ప్రసాదం అందించారు.