You are currently viewing శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీ వాహనాలను దారి మళ్లింపు -జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి

శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీ వాహనాలను దారి మళ్లింపు -జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి

నంద్యాల (బిఎన్ న్యూస్‌), ఫిబ్ర‌వ‌రి 11: నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి శ్రీశైలంలో శ‌నివారం నుండి 21వ తేది వరకు జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఈ మహాశివరాత్రి పండుగ రోజులలో దేశవ్యాప్తంగా భక్తులు, వీఐపీలు భారీగా దైవదర్శనానికి తరలివస్తారని దీనికి సంబంధించి, ముఖ్యంగా ఈనెల 17 నుండి 19వ‌ వరకు విజయవాడకు వెళ్లవలసిన భారీ వాహనాల రాకపోకలు ఎటువంటి అవాంతరాలు లేని వాహనాల రాకపోకల దృష్ట్యా కర్నూలు పట్టణంలోని నంద్యాల చెక్ పోస్ట్ నుండి ఆత్మకూరు – దోర్నాల మీదుగా విజయవాడకు రాకపోకలు నిలిపివేయడం జరిగింది. కావున వాహనదారులు గమనించి లారీలు, భారీ గూడ్స్ వాహనాలు తదితర వాహనాలు ఈనె17 నుండి 19వ తేది వరకు కర్నూలు పట్టణంలో గల నంద్యాల చెక్ పోస్ట్ నుండి నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం మీదుగా విజయవాడకు చేరుకోవలసిందిగా తెలియజేయడమైనది.