నంద్యాల (బిఎన్ న్యూస్), ఫిబ్రవరి 11: పట్టణంలోని మన ఊరు మనగుడి ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో శనివారం రోడ్లమీద తిరిగే ఆవుల కాళ్ళకు గిట్టల కొట్టే కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా పట్టణంలోని ఆవులు నడవలేక చాలా ఇబ్బందులు పడుతున్నాయని వాటిని గుర్తించిన మన ఊరు మన గుడి ఆర్గనైజర్స్ వారు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ మన ఊరు మన గుడి కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని గోమాతల కాల గిట్టలను ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందించడం అన్నారు. అలాగే పట్టణంలో గోమాతలు రోడ్లపై తిరగకుండా గతంలో ఎవరైనా ముందుకు వస్తే గోశాల ఏర్పాటు చేస్తామని తెలిపామన్నారు. కానీ ఎవరు ముందుకు రాకపోవడం అది కూడా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఎవరు రాలేదన్నారు. ఇప్పుడు స్థలం చూపిస్తే మేము చేస్తామని మన ఊరు మన గుడి ఆర్గనైజర్స్ వారు ముందుకు వచ్చారని మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడి వారికి స్థలం చూపిస్తామన్నారు. అలాగే పురాతన దేవాలయాలు రక్షిస్తూ వాటిని శుభ్రం చేస్తూ మంచి దైవ కార్యక్రమాలు చేస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
