You are currently viewing నంద్యాల సబ్ డివిజన్‌లో మద్యం కేసులలో పట్టుబడిన వాహనాలు వేలం -జిల్లా అడిషనల్ ఎస్పీ ఆర్.రమణ

నంద్యాల సబ్ డివిజన్‌లో మద్యం కేసులలో పట్టుబడిన వాహనాలు వేలం -జిల్లా అడిషనల్ ఎస్పీ ఆర్.రమణ

నంద్యాల (బిఎన్ న్యూస్) ఫిబ్రవరి 10: జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజన్‌కు సంబందించి 29 వాహనాలు సంబంధిత అధికారుల అనుమతితో జిల్లా అడిషనల్ ఎస్పీ ఆర్.రమణ ఆధ్వ‌ర్యంలో ప‌ట్ట‌ణ డిఎస్పీ మహేశ్వర్ రెడ్డి పర్యవేక్షంలో శుక్ర‌వారం వాహనాల వేలం వేయడం జరిగింది. ఇందులో 56 మంది వేలంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేలం పాటలో బైకులు, ఆటోలు, కార్లు వేలం వెయ్యగా రూ.7,35,814 రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మూడ‌వ ప‌ట్ట‌ణ సిఐ నరసింహులు, సెబ్ సిఐ గారు, ఎస్ఐలు వారి సిబ్బంది పాల్గొన్నారు.