నంద్యాల (బిఎన్ న్యూస్) ఫిబ్రవరి 10: ప్రతి సంవత్సరము లాగే ఈ సంవత్సరములో కూడా యస్.డి.ఆర్ పాఠశాల ప్రాంగణములో శుక్రవారం ఇన్నోవేటివ్ వరల్డ్ సైన్స్ ఫెయిర్ నిర్వహించడం జరిగినది. ఈ ఇన్నోవేటివ్ వరల్డ్ సైన్స్ ఫెయిర్‌లో విద్యార్థులు రకరకాల ప్రాజెక్టులు తయారు చేసి వాటిని వచ్చిన తల్లిదండ్రులు, ఇతర పాఠశాల విద్యార్థులకు చక్కగా వివరించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డా. సహదేవుడు విచ్చేసి విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకాల ప్రదర్శనలను తిలకించి, విద్యార్థులు వివరించిన విధానాన్ని ప్రసంశిస్తూ అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల మానసిక వికాశానికి ఎంతో దోహదపడతాయని కొనియాడారు. విద్యార్థులు ప్రదర్శించిన రాకెట్ లాంచింగ్ సెంటర్ నమూనాను చూచి విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు.

యస్.డి.ఆర్ పాఠశాలలో ఘనంగా జరిగిన ఇన్నోవేటివ్ వరల్డ్ సైన్స్ ఫెయిర్
- Post published:February 10, 2023
- Post category:Andhra Pradesh / Nandyal