You are currently viewing మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత ఏర్పాట్లు  -నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత ఏర్పాట్లు -నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి

నంద్యాల (బిఎన్ న్యూస్), ఫిబ్రవరి 10: శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల క్షణమే లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని రకాల ముందస్తు పటిష్ట చర్యలు చేపట్టమని, సుమారు 2,400 మంది పోలీసులతో పటిష్ట భద్రత చేపట్టమని జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ భద్రత ఏర్పాట్ల గురించి మాట్లాడుతూ శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు బందోబస్తుకు ఒక అడిషనల్ ఎస్పీ 13 మంది డిఎస్పీలు, 52 మంది సిఐలు, 120 మంది ఎస్ఐలు, 954 మంది ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, 106 మహిళా ఏఎస్ఐ, హెచ్‌సి, పిసిఎస్‌, 464 మంది హోంగార్డులు, 100 మంది స్పెషల్ పార్టీ బృందాలు, డాగ్ స్కాడ్ బృందాలు, మఫ్టీ పోలీస్ బృందాలను బందోబస్తు విధులకు కేటాయించామన్నారు. జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి శ్రీశైలం వెళ్లే భక్తులకు (వాహనదారులకు) కొన్ని హెచ్చరికలు, సూచనలు జారీచేశారు. శ్రీశైల మహా శివరాత్రి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, శనివారం, ఆదివారం, సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందువలన శ్రీశైలం వెళ్ళే భక్తులు (వాహనదారులు) తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఆంద్రప్రదేశ్‌లోని వివిధ‌ ప్రాంతాల నుండి వచ్చే భక్తులు(వాహనదారులు) తమ ఫోర్ వీలర్స్ వాహనంతో పాటు తప్పనిసరిగా డ్రైవింగ్ పై అనుభవం గల డ్రైవర్‌ను తమ వెంట తీసుకుని వెళ్లాల‌న్నారు. ఎందుకనగా డ్రైవింగ్ అనుభవం లేనివారు డ్రైవింగ్ చేయడం వలన వాహనాల క్లచ్ ప్లేట్ పోయి మీ వాహనం, ప్రయాణం మద్యలో ఆగిపోయే ప్రమాదం ఉందని తెలియజేశారు. ఓవర్ లోడ్ వాహనాలు అనుమతించబడవు, ఘాట్ రోడ్డులో వాహనాలు ఓవర్ టేక్ చెయ్యరాదు. ట్రాఫిక్ నిభందానాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మోటార్ వాహ‌నాల‌ పై వెళ్ళే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ దరించాలి. వాహనాలను ఎక్కడపడితే అక్కడ నిలుపరాదు. ఇతర భక్తులకు అసౌకర్యం కల్గించేలా వాహనాలు పార్కింగ్ చేయరాదు. పోలీసు వారు సూచించిన పార్కింగ్ ప్రదేశంలో మాత్రమే వాహనాలను పార్కింగ్ చేసుకోవాల‌న్నారు. సాక్షి గణపతి వద్ద వాహనాలు నిలుపుకొని దర్శనం చెయ్యరాదు. వాహనాలు నిలుపడం వలన ట్రాఫిక్ జామ్ కావడం జరుగుతుంది. కావున భక్తులు గమనించి పోలీసు వారికి సహకరించగలరని జిల్లా ఎస్పీ కోరారు. వాహనాలు ఘాట్ రోడ్డులో ఓవర్ టేక్ చెయ్యరాదు. ఓవర్ లోడ్ తో వాహనాలు వెళ్లరాదు. సత్రములు, పాతాలగంగ వద్ద నుండి దర్శనానికి వెళ్ళే భక్తులు వాహనాలతో దేవాలయానికి వెళ్లరాదన్నారు. నదువలేని వారికొరకు దేవస్థానం, సత్రాల వారు ప్రత్యేకంగా ఆటో సదుపాయం ఏర్పాటు చేశారు. సాక్షి గణపతి నుండి మెయిన్ టెంపుల్ వరకు రోడ్డుకు ఇరువైపుల ఎక్కడ వాహనాలు నిలుపరాదు. వాహనాలకొరకు కేటాయించిన స్థలంలోనే పార్కింగ్ చేసుకొనవలెను. సరుకులు అమ్మేవారు ఘాట్ రోడ్డులో ఎక్కడ రోడ్డుపై సరుకులు అమ్మరాదన్నారు. మహాశివరాత్రి రోజు అనగా ఈనె18వ తేదీ రాత్రి 9 గంటల నుండి మరుసటి దినం అనగా 19వ తేదీ ఉదయం 6.00 గంటల వరకు దోర్నాల నుండి శ్రీశైలం వైపు ఏ వాహనాలు అనుమతించబడవు అని స్ప‌ష్టం చేశారు. మహాశివరాత్రి రోజు ఈనె18వ తేదీ రాత్రి 9 గంటల నుండి మరుసటి దినం అనగా 19వ తేదీ ఉదయం 6.00 గంటల నుండి రాత్రి 12.00 గంటలకు కర్నూలు నందు నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర వాహనాలు (లారీ) నిలపడం జరుగుతుంది. కావున వాహనదారులు పోలీసు వారికి సహకరించగలరని కోరుచున్నాము. ఎక్కడైనా సమస్య ఉన్నచో పోలీస్ సిబ్బంది సత్వరమే స్పందించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ నుండే కాక కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు మొదలగు రాష్ట్రాల నుండి కూడా శ్రీశైలానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టామన్నారు. పాతాళ గంగ ఘాట్ల దగ్గర స్నానం అనుసరించడానికి వచ్చే భక్తులు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా గజ ఈతగాళ్లను నియమించామని తెలియజేశారు. ఆంద్రప్రదేశ్‌కు చెందిన వాహనాలను ఏపిఎస్ఆర్టీసి బస్ స్టాండ్ ప్రాంతంలో, తెలంగాణ, కర్నాటకకు చెందిన వాహనాలను మేకల బండ వెనక ప్రాంతంలో, టూరిస్ట్ వాహనాలను మేకల బండ ప్రక్కన గల ఖాళీ స్థలంలో పార్కింగ్ చేసుకోవాలని పేర్కొన్నారు. కార్‌లకు టెంపుల్ వెనక భాగంలో, ఓల్డ్ హెలిపాడ్, స్కూల్, నిత్య అన్నదాన ప్రక్కన, కమ్మ సత్రం వెనకాల పార్కింగ్ చేసుకోవాలని తెలిపారు. పై నిబంధనలు పాటించని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కె.ర‌ఘువీర్ రెడ్డి హెచ్చరించారు.